Friday, 31 August 2018

నోటుపుస్తకాల పంపిణి

    కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 31 ;  రెబ్బెన మండలంలోని పోతపల్లి  మండల పరిషత్ పాఠశాలలో ఎన్   అర్  ఐ ఖతార్ వేకువ ఫౌండేషన్ మరియు మేధ ప్రాజెక్ట్ వారు పాఠశాలలో చదువుతున్న 39 మంది విద్యార్థిని విద్యార్థులకు సంవత్సరానికి సరిపడా  నోట్ పుస్తకాలుశుక్రవారం  అందించడం జరిగిందని, 1 వ తరగతి పిల్లలకు పలకలను అందచేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానయ్య  తెలిపారు. మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి ఫౌండేషన్ స్పాన్సర్  గణేష్ కుమార్ తో సంప్రదించి  ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీవల్లి,విద్య కమిటీ చైర్మన్  డి సునీల్,విద్యార్థుల తల్లి తండ్రులు   పాల్గొన్నారు.

No comments:

Post a Comment