Monday, 13 August 2018

సరైన విద్యార్హతలు లేకుండా ఉద్యోగమా ?..

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 13 ; సరైన విద్యార్హతలు లేకుండా రెబ్బెన మండల గంగాపూర్ గ్రామ పంచాయతీలో జాగిరి  నరేష్  విధులు నిర్వహిస్తున్నారని  తెలంగాణ జాగృతి మండల అధ్యక్షుడు గోర్ల ప్రవీన్ కుమార్ సోమవారం రెబ్బెన ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, మరియు ఎంపీపీ సంజీవ్ కుమార్ లకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ   డిపిఓ  ఆర్డర్స్ లేకుండా కంప్యూటర్ సర్టిఫికెట్స్ మరియు డిగ్రీ లేకుండానే విధులు నిర్వహిస్తున్నారు  కావున ఆడిట్ కాపీ లేకుండానే సర్టిఫికెట్లు కాని  లేని వ్యక్తిని ఉద్యోగం లోకి ఎలా తీసుకున్నారో విచారణ చేపట్టాలని అంన్నారు.  ఆ వ్యక్తిని వెరిఫికేషన్ లేకుండానే పని చేయడం జరుగుతుంది కావున సర్టిఫికెట్స్ చూసి సర్టిఫికెట్స్ ఉంటే ఉంచుకోవాలని సరిఫికెట్ , ఆర్డర్ కాపీ లేని అతన్నీ  వెంటనే తొలగించాలని అన్నారు.

No comments:

Post a Comment