Thursday, 30 August 2018

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 30 ; గణేష్  నవరాత్రి ఉత్సవాలను  ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్  రమణ మూర్తి , ఎస్సై దీకొండ  రమేష్ లు  అన్నారు. గురువారం రెబ్బెన పోలీస్ స్టేషన్ లో  ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహాలను ప్రతిష్టించే  మండప నిర్వాహకులతో ఏర్పాటుచేసిన పీస్ కమిటీ సమావేశంలో  మాట్లాడారు. మండప నిర్వాహకులు ముందస్తు  అనుమతి తీసుకోవాలని,  గణేష్ నిమజ్జనం రోజున పాటించవలసిన నియమ నిబంధనలను వివరించారు . మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉత్సవాలు నిర్వహించడానికి సహకరించాలని కోరారు.  ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల  పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment