Thursday, 16 August 2018

భారీ వర్షానికి నిండిన చెరువులు, కుంటలు



కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 16 ; రెబ్బెన మండలంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారే వరకు కురిసిన భారీ వర్షానికి మండలంలోని చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బంది కలిగింది. తుంగేడ లో డోంగ్రి శెంకర్ ఇల్లు పూర్తిగా ధాంశం అయింది. పాసిగామా గ్రామా శివారు లో వాగు పరాశర ప్రాంతాల లో పత్తి వరి పంట్ట చేన్లు  పూర్తి నీట మునిగాయి. ముఖ్యంగా గోలేటి పంచాయతీ పరిధిలోని  గుండాల వాగు ఉద్రితికి  ఖైర్గుడ గ్రామానికి రాకపోకలు పూర్తిగా స్తంభిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా   ఉండాలని అధికారులు కోరారు.

No comments:

Post a Comment