సింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలోమహిళలకు శిక్షణ
కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 09; మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అందుకు గాను సింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో సహకారం అందిస్తున్నట్లు జీఎం రవిశంకర్ అన్నారు. గురువారం బెల్లంపల్లి సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రెబ్బెన గోలేటి టౌన్ షిప్ లో మహిళలు కొరకు మోటార్ డ్రైవింగ్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణా తరగతుల్ని జీఎం రవి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి , సింగరేణి సేవా సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు ఎప్పటి నుంచో మోటార్ డ్రైవింగ్ లో శిక్షణ కావాలని కోరారని ఇప్పుడు అది నెరవేరుతున్నదని అన్నారు. మహిళలకు మగ్గం వర్ లో శిక్షణ నూతనంగా ప్రారంభిస్తున్నామన్నారు. గోలేటి లో సింగరేణి కుటుంబ సభ్యులకు పలు రంగాలలో శిక్షణ ఇపించడం ద్వారా వారికీ ఉపాధి మార్గాలను చూపుతున్నామన్నారు . మహిళలు ఈ కార్యక్రమాలలో శిక్షణపొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీబీకే ఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్ రావు, డీపీఎం ఏ రాజేశ్వర్ ,సీనియర్ సేవ సభ్యులు సొల్లు లక్ష్మి, కుందారపు శంకరమ్మ, సేవాసమితి శిక్షకులు విజయ, తిరుమల మహిళలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment