Saturday, 25 August 2018

బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్షాబంధన్

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 25 ; రెబ్బెన మండలంలోని ఆర్ట్స్  & సైన్స్  డిగ్రీ కాలేజీలో బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ  వారి ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు.విద్యార్థినీలతో విద్యార్థులకు రాఖీలను కట్టించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా, రక్త సంబంధం ఉన్నా లేకున్నా , సంబంధాన్ని పెంచే పండగ  రక్షాబంధన్ అన్నారు. అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్ళకు ప్రేమానురాగాలకు సూచికగా ఈ పండుగ జరుపుకుంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మాన్, సంస్థ సభ్యులు పెంటపర్తి తిరుపతి, రాంటెంకి సంజయ్, బొడ్డు శ్రీకాంత్, కళాశాల ఉపాధ్యాయులు దుర్గం దేవాజీ,  మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment