Sunday, 12 August 2018

పేకాట రాయుళ్ల అరెస్ట్

 కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 12 ; రెబ్బెన మండలం లోని నంబాల గ్రామపంచాయతీ పరిధిలోని కొమ్ము గూడెం లో పేకాట ఆడుతున్నవారిపై  ఆదివారం దాడిచేసి  ఎసై ధీకొండ   రమేష్  పట్టుకున్నారు. గ్రామ ప్రాధమిక  పాఠశాలలో పేకాట ఆడుతున్న  పూదరి భీమయ్య, పూదరి రాజు, పూదరి పోశన్న, బక్క లక్ష్మణ్ ల    వద్ద నుంచి 5,490 రూపాయల నగదు, రెండు మోటార్ సైకిళ్లను, పేకాట సామాగ్రి ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.

No comments:

Post a Comment