కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 10 ; కార్మికుల సమస్యలపై ఈ నెల 13 న చేపట్టిన చలొ కొత్తగూడెం కార్యక్రమాన్ని విజయవంతం చేయలని ఎఐటియుసి గోలేటి బ్రాంచ్ సెక్రటరీ ఎస్ తిరుపతి అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలంలోని గోలేటి కేఎల్ మహేంద్ర భవనంలో చలో కొత్తగూడెం ధర్నా కు సంబంధించిన గోడ ప్ర తులను విడుదల చేసి మాట్లాడారు. లాభాల వాటలో ముప్పై శాతం చెల్లించాలని పదో వేజ్ సిఫారసును పూర్తిగా అమలయ్యేలా చూడాలని అన్నారు. కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను పూర్తిగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలో జరిగే ధర్నా కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్మిక సమస్యలు పరిష్కారం కోసం అందరూ కలిసి విజయవంతం చేయాలని కార్మికులకు సూచించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు బయ్య మొగిలి, జగ్గయ్య ,కృష్ణ మోహన్, సత్యనారాయణ, సారయ్య, ఆనంద్ ,శేషు ,శ్రీనివాస్ ,రాజేష్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment