Friday, 17 August 2018

అసిఫాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న మర్సుకోల సరస్వతి


కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 17 ; రాబోయే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అసిఫాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నానని ఆసిఫాబాద్ మాజీ  సర్పంచ్ మార్సుకోల సరస్వతి అన్నారు. శుక్రవారం  రెబ్బెన మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల  సమావేశంలో  మాట్లాడుతూ    2019  ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు ఆదరిస్తారని, ఆసిఫాబాద్ సర్పంచ్ గా అతి తక్కువ నిధులతో అసిఫాబాద్ పట్టణాన్ని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి పరిచానని అన్నారు.  గత 2014 లో ఎన్నీకలో టిడిపి పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు  26,000 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయని . అప్పుడు టిడిపి పార్టీ లేకుండా అన్ని ఓట్లు వేసి ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, వచ్చే ఎన్నికల్లో   ఆదరించి  మద్దతు తెలపాలని కోరరు. రాబోయే  రెండు లేదా మూడు నెలల్లో  ఏ పార్టీ 'బి' ఫాం తో నిలబడ పోతున్నది తెలుపుతానన్నారు. . ఈ కార్యక్రమంలో సరస్వతి మద్దతుదారులు  తోట లక్ష్మణ్,  ఎండి. ఖలీద్, వినోద్, నాగోసీ శంకర్, లెండుగురే ఆనందరావు, మొర్లే శ్రీనివాస్, గుర్నులే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment