కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 15 ; తెలంగాణా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంలో కంటి సమస్యలు ఉన్నవారు ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని రెబ్బెన ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, జడ్పీటీసీ అజ్మిరా బాబు రావు లు అన్నారు. బుధవారం రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 2019 జనవరి 28 వరకు కొనసాగుతుందన్నారు. ఈ కేంద్రంలో ఉచితంగా కంటి పరీక్షలుచేసి, అవసరమైతే కంటి అద్దాలు ఇవ్వబడతాయన్నారు. పరీక్షకు వచ్చేవారు తమ ఆధార్ కార్డు ను వెంట తీసుకొనిరావాలని అన్నారు. సుశిక్షితులైన వారితో ఈ పరీక్షలు చేయబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధురి, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, తెరాస టౌన్ అధ్యక్షురాలు మన్యం పద్మ, ఆసుపత్రి సిబ్బంది కమల్, ప్రవీణ్, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment