Saturday, 4 August 2018

ఈత వనాన్ని ధ్వంసం : వారిపై చర్యలు తీసుకోవాలి




   కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 04 ; రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో గల ఈత వనం లో గత వారం హరితహారంలో భాగంగా నాటిన ఈత మొక్కలను , ఈతచెట్లను, గీత కార్మికులు ఉపయోగించే పనిముట్లను శుక్రవారం రాత్రి  ఇసుక మాఫియా కి చెందిన వ్యక్తులు ధ్వంసం చేసినట్లు వారిపై చట్ట రీత్యా తగు చర్యలు తీసుకోవాలని  రెబ్బెన మండల గీత సహకార సంఘం వారు  తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మి  నారాయణకు     శనివారం  వినతి పత్రం అందచేసారు . ఈ సందర్భంగారాష్ట్ర గౌడ  సంఘం అధ్యక్షులు   మోడెమ్ సుదర్శన్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులూ   కేసరి ఆంజనేయులు గౌడ్  మాట్లాడుతూ   .గ్రామంలో గల ఈతవనానికి  ఆనుకొని ఉన్న భూమిలో హరితహారం కార్యక్రమంలో గీత కార్మికులకు ఉపాధి కలించేవిధంగా ఈతమొక్కలను  నాటడంజరిగిందని, ఇసుకమాఫియాకు వాగుకు వెళ్ళడానికి మార్గం మూసుక పోవడంతో ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానంవ్యక్తం చేశారు. ఇసుక దందా చేసేవారికి ఈ చెట్లకు నష్టం కలిగించవద్దని చెప్పినందుకు కక్ష సాధింపు చేర్యగా ఈ పనికి పూనుకున్నట్లు తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, ధ్వంసం చేసిన మొక్కలను తిరిగి నా టించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో గ్రామ  గౌడ సంఘం అధ్యక్షులు మడిపెల్లి లక్ష్మి నారాయణ గౌడ్,  మడిపల్లి సత్యనారాయణ గౌడ్, మడిపల్లి వీరమల్లు గౌడ్, మడిపల్లి వెంక గౌడ్, సత్య గౌడ్, రామ గౌడ్, వెంకటేశ్వర గౌడ్, వెంకన్న గౌడ్,  మరియు గ్రామా గౌడ కులస్తులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment