Wednesday, 15 August 2018

ఘనంగా 72 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 15 ; 72వ  స్వాతంత్ర్య  దినోత్సవాన్ని పురస్కరించుకొని  రెబ్బెన మండలంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ఎం ఆర్ ఓ సాయన్న, . ఎంపీడీవో  కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెబ్బెన ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్,  రెబ్బెన పోలీస్ స్టేషన్లో ఎస్సై దీకొండ  రమేష్,  పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్  సాగర్ . మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాలలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు  మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులు , అన్ని  రాజకీయ పార్టీల కార్యాలయాలలో పార్టీ నాయకులూ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి  జాతీయ జండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు  వక్తలు మాట్లాడుతూ దేశం జరుపుకొంటున్న 72 వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకొంటూ, దేశాన్ని ముందుకు నడిపించే భాద్యతను దేశ ప్రజలందరూ తీసుకోవాలని కోరారు. . ఈ కార్యక్రమాలలో  పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది,  రాజకీయ పార్టీల నాయకులూ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment