కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 06 ; విద్యార్థులు చిన్నతనం నుండే క్రీడలపై ఆసక్తి పెంచుకుని అన్ని రంగాల్లో రాణించాలని బెల్లంపల్లి ఏరియా జిఎం రవిశంకర్ అన్నారు. సోమవారం గోలెటి టౌన్ షిప్ లో ఆఫీసర్ క్లబ్ తరఫున ఆగస్టు 15 పురస్కరించుకుని చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం రవిశంకర్ జెండా ఊపి ఆటల పోటీలను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ చిన్నారులు చిన్నతనం నుండే అన్ని రంగాల్లో రాణించడం కోసం క్రీడలపై అలవాటు చేసుకోవాలని చిన్నారులకు ఆయన సూచించారు .క్రీడలతో పాటు విద్యాబుద్ధులు అభ్యసించి ఉన్నత శ్రేణిలో రాణించాలన్నారు స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బహుమతులు అందించడం అందించడం జరుగుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా సేవా సమితి అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్ ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి ప్రసాదరావు స్పోర్ట్స్ కార్యదర్శి రాజేష్ లేడిస్ క్లబ్ కార్యదర్శి హిమబిందు స్పోర్ట్స్ కార్యదర్శి శ్రీలతతోపాటు చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment