కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 10 అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 82వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవిందర్ కోరారు. పొత్తిళ్లలోనే పిడికిలి బిగించి స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో రాజధానిలోని బెనారస్ యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని అన్నారు. నాటి స్వాతంత్ర్య ఉద్యమం నుండి నేటి విద్యారంగ సమస్యల పరిష్కారానికై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం విద్యను వ్యాపారం చేస్తున్నారని అన్నారు. పాలకులు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఏ ఐ ఎస్ ఎఫ్ ఆద్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు. ఆగస్టు 12 నుండి వారం రోజుల పాటు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.
No comments:
Post a Comment