Tuesday, 14 August 2018

గర్భిణీ స్త్రీలకు ఉపాహారం పంపిణి

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 14 ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రలో మంగళవారం   తెరాస మహిళా మండల అధ్యక్షురాలు మన్యం పద్మ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణులకు  తోష్ లు పంపిణి చేశారు.  ఈ కార్యక్రమానికి రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్యం పద్మ  మాట్లాడుతూ  గర్భిణీ స్త్రీలకు ఉపాహారం పంపిణి కార్యక్రమాన్ని గత కొన్ని నెలలుగా చేపడుతున్నట్లు. ఇక ముందు కూడా  ప్రతి మంగళ వారం ఈకార్యక్రమం  ఉంటుందని అన్నారు, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు  కుందారపుశంకరమ్మ, మండల  తెరాస మహిళా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ అరుణ,    రెబ్బెన తెరాస నాయకులు  వినోద్  జైస్వాల్, నరేష్ , ఆరోగ్య కేంద్రం వైద్యురాలు  డాక్టర్ మాధురి, సూపర్ వైజర్  భాగ్య లక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది   తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment