Thursday, 9 August 2018

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ప్రభుత్వం : కాంగ్రెస్, టీడీపీ పార్టీల నేతలు

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 09;  ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం  ఖూనీ చేసిందని, రాజకీయ వ్యవస్థలో పోలీసులను పావులుగా గా వాడుకుంటున్నారని ఉమ్మడి ఆదిలాబాద్  కాంగ్రెస్ డిసీసి ప్రధాన కార్యదర్శి  విశ్వప్రసాద్, రెబ్బెన    మాజీ జడ్పీటీసీ పల్లె ప్రకాశం రావు, ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బలేశ్వర్ గౌడ్,  ఎంపీటీసీ కోవూరు శ్రీనివాస్  లు ఆరోపించారు. రెబ్బెన మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోమాట్లాడుతూ ఈ నెల 8 న గౌరవ హై కోర్ట్ శ్రీమతి మంగ సమావేశానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి అడ్డంకులు కల్పించరాదని ఆదేశించిందన్నారు.  హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎంపీటీసీ శ్రీమతి టేకం మంగను సమావేశ మందిరానికి వెళ్లకుండా సిఐ రమణ మూర్తి  అడ్డుకున్నారని దానికి తమ వద్ద ఆధారాలున్నాయని ఈ విషయంపై హైకోర్ట్ కు వెళతామని అన్నారు. అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య కనీసం విలేఖరులకు కూడా ప్రేవేశంలేకుండా నిర్వహించి రాజకీయ వ్యవస్థలో పోలీసులను పావులుగా గా వాడుకుంన్నారని అన్నారు.  టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి మాట్లాడుతూఅవిశ్వాస సమావేశం పారదర్శకంగా జరగడానికి పూర్తి వీడియో చిత్రీకరణ జరపాల్సి ఉండగా,  విలేఖరులను అనుమతించకుండా, మీడియా గొంతు నొక్కేసి పూర్తిగా రాజకీయకుట్రలో భాగంగా పోలీసులు ప్రవర్తించారని  అన్నారు. ఎంపీటీసీ  మంగను  సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వస్తున్నాయని సి ఐ రమణ మూర్తి ని  వివరణ కోరగా అలాంటిది ఏమి జరగ లేదని సమావేశం మొదటి అంతస్తులో ఉండడంతో ఎంపీటీసీ శ్రీమతి టేకం  మంగ అనారోగ్యకారణంగా మెట్ల వద్దనే ఆగిపోయిరని తెలిపారు. 

No comments:

Post a Comment