కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 12 ; దహేగం మండల సమస్యలు పరిష్కరించాలని గ్రామీణ చైతన్య సేవ సమితి శనివారం దహేగం నుండి ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం రెబ్బెన మండల కాగజనగర్ x రోడ్ కు చేరుకుంది. వీరికి మద్దతుగా రెబ్బెన యువకులు మోడెం రాజేంద్రప్రసాద్ గౌడ్, దుర్గం దేవాజి, గోగర్ల రాజేష్, అవిడపు గోపి, అంబిలపు అశోక్, తదితరులు వారికి గుడ్లు పాలు మరియు అరటి పండ్లు అందించడం జరిగింది. పాదయాత్ర ఈరోజు సాయంత్రం అసిఫాబాద్ చేరుకొని రేపు ఉదయం కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తారు . దహెగాం నుండి బయల్దేరిన పాదయాత్రలో గ్రామీణ సేవ సమితి సభ్యులు కుందరపు రమేష్, ఇందురీ తిరుపతి, రాపెళ్లి రాజన్న, నజీర్ తదితరులుపాల్గొన్నారు.
No comments:
Post a Comment