కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 10; జాతీయ నులిపురుగుల నిర్మూలన రోజును పురస్కరించుకొని శుక్రవారం రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులందరికి అల్బెండజోల్ మాత్రలు వేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ తెలిపారు. ఈ సందర్బంగా క్లస్టర్ సీఆర్పీ ఎం.రాజేష్ మాట్లాడుతూ నులిపురుగులు కలిగి ఉన్న పిల్లలు రక్తహీనత,పోషకాహారలోపం,ఆకలిలేకపోవుట,కడుపునొప్పి,వికారం,వాంతులు మరియు బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడతారు.కావున పిల్లలందరూ వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రత పాటించాలి.పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి,గోర్లని శుభ్రంగా,చిన్నవిగా ఉంచుకోవాలి.ఆహారం పై మూత పెట్టుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ,ఉపాద్యాయులు ఆనంద్,శ్రీనివాస్ ఏ ఎన్ ఎం లు సునీత, కళావతి, ఆశ కార్యకర్త సుజాత,అంగన్వాడీ టీచర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment