కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 12 ; విద్యార్థినులు తమ తల్లి తండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలని రెబ్బెన ఎస్సై ధీకొండ రమేష్ అన్నారు. పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలోని బాలికల వసతి గృహాన్ని సందర్శించి వసతి గృహంలోని బాలికలకు పోలీస్ వ్యవస్థ గురించి అవగాహన కల్పించారు. తోటి విద్యార్థినులతో స్నేహ భావంతో మెలగాలని, హాస్టల్ సిబ్బందికి తెలియకుండా బయటకు వెళ్లరాదని, సూచించారు. బాలికలందరు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని మంచి పౌరులుగా ఎదగాలని అన్నారు.
No comments:
Post a Comment