కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 04 ; రెబ్బెన మండల నంబాల గ్రామ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుల వీడ్కోలు సమావేశంశనివారం జరిగింది. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు కైరం జనార్ధన్ మరియు విశాలాక్షి గార్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్వల శంకర్, పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల సదానందం ముఖ్య అతిధులుగాహాజరై గత 8 ఏళ్లుగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉంటూ పిల్లలను శ్రద్దగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్ది బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి వారి సేవలను కొనియాడారు..ఈ కార్యక్రమంలో నంబాల సహకార సంఘం డైరెక్టర్ గజ్జెల సత్యనారాయణ, నంబాల ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు ఆర్ కే ప్రసాద్ , నంబాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై సోమశేఖర్, ఉపాధ్యాయులు శ్యామ్ , నాగరాజు, .. కల్పన, కవిత, గ్రామ పెద్దలు, దేవరకొండసంతోష్, రాజు, శ్రీకాంత్, దుర్గంశివాజీ, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment