Tuesday, 21 August 2018

పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని వినతి

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 21 ; రెబ్బెన మండలం గోలేటి గ్రామపంచాయతీలో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా  కార్యదర్శి భోగే ఉపేందర్,   బీజేపీ జిల్లా కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్  రెబ్బెన ఎంపీడీవో కు  వినతి పత్రం  అందచేశారు. అనంతరం మాట్లాడుతూ  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంచాయతీ పరిధిలోని రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ముఖ్యంగా భగత్ సింగ్ నగర్ లో పరిస్థితి దారుణంగా ఉన్నారు. గత సంవత్సర కాలంగా మరుగు దొడ్లు నిర్మించుకున్నవారికి బిలులు చెల్లించడం లేదని అన్నారు.  గత  రెండు నెలలనుంచి త్రాగునీరు రావడంలేదని, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పై సమస్యలను వెంటనే పరిష్కరింహాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తిని రాము, గట్టు ప్రభాకర్, ప్రసాద్, శ్యామరావు , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment