Friday, 3 August 2018

తల్లి పాలు ఎంతో శ్రేష్టం

 కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 03 ;    అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రెపాలు త్రాగించాలని, అవి ఎంతో శ్రేష్టకరమని ప్రభుత్వ ప్రాధమిక ఆసుపత్రి వైదురాలు  డాక్టర్ మాధురి, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ లు  అన్నారు.  తల్లిపాల వారోత్సవాల సందర్బంగా రెబ్బెన మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో  శుక్రవారం  అంగన్వాడీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన  అవగాహన సదస్సులో  మాట్లాడారు.  అమ్మ విశిష్టతను సంవత్సరానికి ఒక్క రోజైన గుర్తుచేసుకోడానికితల్లిపాలవారోత్సవాలునిర్వహించుకుంటున్నామన్నారు.   తల్లి పాలలో లభించే పోషకాలు వలన రోగనిరోధక శక్తి లభిస్తుందని , ఎదిగే బిడ్డలకు కావాల్సినవన్నీ   తల్లిపాలలో సమృద్దిగా లభిస్తాయన్నారు. తల్లి పాలతో శిశువు వ్యాధి నిరోదక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. బిడ్డకు కనీసం ఆరు నెలల వయసు వరకు తల్లి పాలు త్రాగించాలన్నారు. బాలింతలు ఆకు కూరలు, పాలు, గ్రుడ్లు సమృద్ధిగా తీసుకోవాలని ప్రతి గ్రామంలోని బాలింతలకు అవగాహన కల్పించాలన్నారు.   ఈకార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ చిట్టెమ్మ,సరోజినీ దేవి,  హెల్త్‌ సూపర్‌ వైజర్‌లు, అంగన్వాడీ కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment