కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన ఆగస్టు 1 ; :బెల్లంపల్లి ఏరియా సింగరేణికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుందని ఏరియా జియం కె రవి శెంకర్ తెలిపారు. బుధవారం గోలేటి జియం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశయంలో గడిచిన నెలకు గాను ఉత్పత్తి వివరాలను వెల్లడించారు.జులై మాసంలో బెల్లంపల్లి ఏరియాకు 490000టన్నులకు గాను 392815 టన్నుల 80 శతం ఉత్పత్తి సాధించినట్టు తెలిపారు.ఘనుల పరంగా చూసుకున్నట్లైతే ఖైర్గుడా ఓసిపి 270000 టన్నులకు గాను 159123 టన్నుల 59 శాతం ఉత్పత్తి సాధించినట్లు మరియు బిపిఎ ఓసిటు 80000 వేల టన్నుల ఉత్పత్తికి గాను 27952 టన్నుల 47 శతం ఉత్పత్తి సాదించినట్లు తెలిపారు.డోర్లి 1 ఓసిపి 180000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 205740 టన్నుల 129 శాతం ఉత్పత్తి సాధించడం జరిగిందని అన్నారు.ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాల ప్రభావంతో బొగ్గు ఉత్పత్తి తగ్గినది అన్నారు.రవాణా విషయంలో కూడా లారీల సమ్మె కారణంగా బొగ్గు రవాణా లో కూడా వెనుకబడినట్లు తెలిపారు.బెల్లంపల్లి ఏరియా కార్మికులకు పదవ వెజ్ బోర్డులో దిగిపోయిన కార్మికులకు ఈ నెల 9వ తేదీన బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని కార్మికులు ఈ విషయంలో చింతించాల్సిన పనిలేదని ఈ సందర్బంగా తెలిపారు.చట్ట ప్రకారం పెరిగిన గ్రాడ్యూటీ కూడా చెల్లించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్వోటు జియం వీరస్వామి,డివైపీఎంలు తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment