కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 31 ; దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, టీ ఆర్ ఎస్ కే వి జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. మంగళ వారం రెబ్బెన మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల 9వ రోజు నిరవధిక సమ్మె శిబిరంలో టీడీపీ జిల్లా మహిళ ప్రెసిడెంట్ సొల్లు లక్మి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు . గ్రామ పంచాయతీ కార్మికులు,సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారని గ్రామ పంచాయతీ కార్మికులకు వారితో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండు చేశారు, తెరాస ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వహిస్తుందని అన్నారు.శ్రమదోపిడికి గురిచేస్తుందని అన్నారుగ్రామ పంచాయతీ కార్మికులు చాలి చాలని వేతనాలు తీసుకొంటు గ్రామాలు అభివృద్ధి చెందడంతో కీలకపాత్ర పోసిస్తున్నారని,కానీ ప్రభుత్వం వారికి సరియైన గుర్తింపు ఇవ్వడకపోవడం చాలా బాధాకరమని అన్నారు.ప్రెసిడెంట్ రమేష్,కార్యదర్శి వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ లాలసింగ్, కార్మికులు దుర్గం విజయ్,నారాయణ,శంకర్,సంతోష్, ప్రకాష్,వీరయ్య,శంకర్,రాజేశ్వరి, లక్మి, కొండు లక్మి తోపాటు తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment