
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Friday, 31 August 2018
శక్తి ప్రాజెక్ట్ నమోదు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పర్యటన

ప్రగతి నివేదన సభకు భారీగా తరలివెళ్ళాలి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 31 ; ప్రగతి నివేదన సభకు భారీగా, స్వచ్చందంగా తరలి వెళ్లాలని రెబ్బెన మండల తెరాస మహిళా అధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ పిలుపునిచ్చారు.శుక్రవారం రెబ్బెన మండల కేంద్రంలో ని అతిధి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా తెరాస రభుత్వం చేసిన ప్రజోపయోగ పనులను వివరించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటుచేస్తున్న సభను మండలంనుంచి స్వచ్చందంగా భారీ సంఖ్యలో తరలి వెళ్లి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మాజీ సర్పంచ్ లు పెసర వెంకటమ్మ, గజ్జెల సుశీల, గోలేటి ఎంపీటీసీ వనజ తది తరులు పాల్గొన్నారు.
నోటుపుస్తకాల పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 31 ; రెబ్బెన మండలంలోని పోతపల్లి మండల పరిషత్ పాఠశాలలో ఎన్ అర్ ఐ ఖతార్ వేకువ ఫౌండేషన్ మరియు మేధ ప్రాజెక్ట్ వారు పాఠశాలలో చదువుతున్న 39 మంది విద్యార్థిని విద్యార్థులకు సంవత్సరానికి సరిపడా నోట్ పుస్తకాలుశుక్రవారం అందించడం జరిగిందని, 1 వ తరగతి పిల్లలకు పలకలను అందచేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానయ్య తెలిపారు. మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి ఫౌండేషన్ స్పాన్సర్ గణేష్ కుమార్ తో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీవల్లి,విద్య కమిటీ చైర్మన్ డి సునీల్,విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.
సి పి ఎస్ రద్దుకై నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 31 ; రెబ్బెన మండలంలోని ఉపాధ్యాయులందరు సెప్టెంబర్ 1 న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణా రాష్ట్ర పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ మండల అధ్యక్షులు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ లు పిలుపునిచ్చారు. శుక్రవారం రెబ్బెన లో విలేఖరులతో మాట్లాడుతూ సి పి ఎస్ విధానం రద్దుకై పి ఆర్ టి యు రాష్ట్ర శాఖా పిలుపు మేరకు సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
Thursday, 30 August 2018
.టి ఆర్ ఎస్ వి అద్వ్యర్యంలోకెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 30 ; రాష్ట్రంలో 7 కొత్తజోన్లను సాధించినందుకు కెసిఆర్ చిత్రపటానికి టి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు మస్క రమేష్ అద్వ్యర్యంలో గురువారం రెబ్బెన అతిధి గృహంలో
పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో7 కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు గురువారం గౌరవ రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారని ఇది తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అని అన్నారు. ఎందుకంటే ఈ నిర్ణయంతో స్థానికులకే 95% ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇందులో గౌరవ సీఎం కేసీఆర్ గారి పాత్ర అత్యంత కీలకం అని అన్నారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, తెరాస నాయకులూ చెన్న సోమశేఖర్, బొమ్మినేని శ్రీధర్, సంగం శ్రీనివాస్, మోడెమ్ సుదర్శన్ గౌడ్, బొమ్మినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పౌరహక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 30 ; పౌరహక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి సమాజంలో బాధ్యతతో మెలగాలని రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి, ఎస్సై దీకొండ రమేష్ లు అన్నారు. మండలంలోని ఇందిరానగర్ గ్రామస్తులతో ఏర్పాటుచేసిన సమావేశం లో పౌర హక్కుల గురించి మాట్లాడారు. ప్రజలందరూ తమ తమ హక్కులు , భాద్యతలు తెలుసుకోవాలని అన్నారు. దేశంలోని పౌరులందరూ రాజ్యాంగం ప్రకారం నడచులోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 30 ; గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి , ఎస్సై దీకొండ రమేష్ లు అన్నారు. గురువారం రెబ్బెన పోలీస్ స్టేషన్ లో ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహాలను ప్రతిష్టించే మండప నిర్వాహకులతో ఏర్పాటుచేసిన పీస్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. మండప నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలని, గణేష్ నిమజ్జనం రోజున పాటించవలసిన నియమ నిబంధనలను వివరించారు . మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉత్సవాలు నిర్వహించడానికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Wednesday, 29 August 2018
బెల్లంపల్లి ఏరియా సింగరేణిలో లాభాల వాటా చెక్కుల చెల్లింపు
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 29 ; సింగరేణి లాభాల వాటాల్లో ఇరవై ఏడు శాతం కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుధవారం బెల్లంపల్లి ఏరియాలోని అన్ని గనుల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని జిఎం రవిశంకర్ ప్రారంభించారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా , డిపార్ట్మెంట్ ల వద్ద అధికారులు చెక్కులను కార్మికులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్మికులు అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ సంవత్సరం కూడా సంస్థను లాభాలబాటలో పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ జె కిరణ్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు, ఓ సి పి మేనేజర్ రమేష్, డీపీయం రామశాస్ట్రీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజల్ని మభ్యపెడుతున్న తెరాస ప్రభుత్వం : జిల్లా బీజేపీ అధ్యక్షులు జె బి పౌడెల్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 29 ; తెరాస ప్రభుత్వం ప్రజల సమస్యలు గాలికి వదిలేసి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు జె బి పౌడెల్ అన్నారు. బుధవారం రెబ్బెన మండల కేంద్రంలో గోలేటి, నంబల. నారాయపూర్, గంగాపూర్, పుంజుమేరగుడా, తక్కల పల్లి, పులికుంటా, కిష్టపూర్, కైర్ గాం, నవేగాం గ్రామాలలో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలుచేసే వివిధ పథకాల్ని రాష్ట్రప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని, కేంద్రప్రభుత్వ అనేక పథకాలను ప్రెవేశ పెట్టి వాటి అమలుకు రాష్ట్రాలకు నిధుల పంపిణి చేస్తోందని, కానీ రాష్ట్రప్రభుత్వాలు వాటిని తాము ప్రెవేశపెట్టిన పథకాలుగా ప్రచారం చేసి ప్రజలను మభ్య పెడుతున్నాయని ఆన్నారు. నిజాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ బైక్ ర్యాలీని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోనగిరి సతీష్ బాబు రెబ్బెన మండల అధ్యక్షుడు కుందారం బాలకృష్ణ మండల ప్రధాన కార్యదర్శి పస్తేమ్ పొశం తెలంగాణ విమోచన కమిటీ జిల్లా కన్వెనర్ జనగామ విజయ్ కుమార్ OBC మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి, BJYM జిల్లా కార్యదర్శిలు అరికిల్ల శేఖర్ బతిని రాము BJYM మండల ప్రధాన కార్యదర్శి కోట రాజేశ్వర్ JBP యువసేన ప్రధాన కార్యదర్శి అజ్మెరా ప్రశాంత్. అఖిల్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పెన్షన్ విద్రోహ సభలను విజయవంతం చేయాలి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 29 ; సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జరిగే ర్యాలీలు ,సభలలో ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొనాలని జాక్టో,యు ఎస్ పి సి ప్రతినిధులు చరణ్ దాస్ , రవికుమార్, రాజకమలాకర్ రెడ్డి, తుకారాలు పిలుపునిచ్చారు. రెబ్బెన మండలం జిల్లా పరిషత్ పాఠశాలలోబుధవారం గోడప్రతులను విడుదల చేసి మాట్లాడారు. సి పి ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరారు. పెన్షన్ పొందడం ప్రతి ఉద్యోగి హక్కు అని గౌరవ సుప్రీ కోర్ట్ ఇచిన తీర్పుకు అనుగుణంగా పాత పెన్షన్ విధానాన్ని ఆచరణలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోహైమత్, శ్రీలత, పుష్పలత, శ్రీదేవి, షబానా బేగం, బాణేష్, గోపాల్, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 28 August 2018
గ్రామాలకు మొక్కల పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 28 ; రెబ్బెన మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీ నుండి మండలంలోని గ్రామాలకు మొక్కలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా రెబ్బెన ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగాప్రారంభించిన హరిత హారం కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అన్నారు. గ్రామాలలో ప్రజలందరూ మొక్కలునాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ పి ఓ కల్పన, పంచాయతీ సెక్రటరీలు శంకర్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సంజీవని సేవ సంస్థ ఆధ్వర్యంలో హరిత హారం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 28 ; సంజీవని సేవ సంస్థ ఆధ్వర్యంలో రెబ్బెన మండల కేంద్రంలోని 1వ నెంబర్ అంగన్వాడి కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దీకొండ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో దూరదృష్టితో మొదలు పెట్టిన హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రజలందరూ తమ భాద్యతగా తీసుకోవాలని అన్నారు. తమ సంస్థ తరఫునుంచి ప్రజలలో అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచి పెద్దచేయడంద్వారా వేసవిలో మండుటెండలనుండి ఉపశమనం పొందవచ్చన్నారు. భూగర్భజలాల మట్టంకుడా పెరిగే అవకాశమున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాద్యాయులు ఈశ్వర్, సభ్యులు డి . విజయ కుమారి, వై సుజాత, ఎస్ డి రేష్మ , విద్యార్థులు పాల్గొన్నారు.
ఖతార్ వేకువ ఫౌండేషన్ నోట్ పుస్తకాల పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 28 ; రెబ్బెన మండలంలోని తుంగేదా మండల పరిషత్ పాఠశాలలో ఎన్ అర్ ఐ ఖతార్ వేకువ ఫౌండేషన్ మరియు మేధ ప్రాజెక్ట్ వారు పాఠశాలలో చదువుతున్న 69 మంది విద్యార్థిని విద్యార్థులకు సంవత్సరానికి సరిపడా నోట్ పుస్తకాలు మంగళవారం అందించడం జరిగిందని, 1 వ తరగతి పిల్లలకు పలకలనుఅందచేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగయ్య తెలిపారు. మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి ఫౌండేషన్ స్పాన్సర్ గణేష్ కుమార్ తో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగవేణి, అరుణ దేవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలోఅల్పాహార పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 28 ; మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం రెబ్బెన టౌన్ తెరాస మహిళా అధ్యక్షురాలు మన్యం పద్మ గర్భిణీ స్త్రీలకు పులిహోరను అల్పాహారం గా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలనుంచి పరీక్షలకై వచ్చే గర్భిణీ స్త్రీలకు తన వంతు ధర్మంగా అల్పాహారం క్రమం తప్పకుండా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో పాటుగా సమాజంలోని అందరు సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పావని, సునీత, ఆరోగ్యమిత్ర లావణ్య తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే కెసిఆర్ ధ్యేయం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 28 ; సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధి కార్మికుల సంక్షేమం ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని టిబిజికెఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఏరియాలోని డోర్లి ఓపెన్ కాస్ట్ వద్ద జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కార్మికవర్గం మేలుకోసం నిర్ణయాలు తీసుకోవడంతో జాతీయ సంఘాలు జీర్ణించుకోలేక సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. జాతీయ సంఘాలు పోగొట్టిన హక్కులను తిరిగి సాధించుకుందామని పేర్కొన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నట్లు తెలిపారు సింగరేణి గడించిన లాభాల్లో ఇరవై ఏడు శాతం వాటా ఈ నెల ఇరవై తొమ్మిది న కార్మికులకు చెల్లిస్తున్నారనారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు ఇకనుంచి ఉద్యోగాలుగా పిలవాలని నిర్ణయం చేయడం సంతోషకర మన్నారు గతంలో జాతీయ సంఘాల అవగాహన లోపంతో కుదుర్చుకున్న ఒప్పందంలో బోనస్ లో ఏడు శాతం పింఛన్ రికవరీ చేయడంలో కార్మికులు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెబొగకాసం కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్ సదాశివ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి శంకర్, సమ్మయ్య, కొగిలాల రవీందర్, ఛార్లెస్, రామారావు, పిట్ కార్యదర్శి నర్సింగరావు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి లు, మల్లేష్, మస్తాన్, భాను సతిష్, నాగేందర్, ప్రకాష్ నాయుడు, గంగి శెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Monday, 27 August 2018
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ; ఎస్ ఓ టూ జీఎం వీరాస్వామి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 27 ; క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఎస్ ఓ టూ జీఎం వీరాస్వామి అన్నారు. సోమవారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా డబ్ల్యూ పి ఏ అండ్ జి ఏ ఆధ్వర్యంలో కార్మిక క్రీడాకారులకు షటిల్ , బాడ్మింటన్ విభాగాలలో రెబ్బెన గోలేటి సీ ఈ ఆర్ క్లబ్ లో నిర్వహించరు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసి మాట్లాదారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు.క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోటీలలో ప్రతిభ కనపరచి కంపెనీ లెవెల్, మరియు కాల్ ఇండియా షాయిలో ప్రతిభ కనపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూ పి ఏ అండ్ జి ఏ గౌరవ కార్యదర్శి డి వై పి ఎం రాజేశ్వర్, టీజీబీకేష్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు, స్పోర్ట్స్ సూపెర్వైజర్ హెచ్ రమేష్ ,స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ జి పి చంద్రకుమార్ కమ్యూనికేషన్ సెల్ సూపర్ వైజర్ కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.
టీజీబీకేష్ ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 27 ; సింగరేణి కార్మికులకు లాభాలలో వాటా 27 శాతం ఇస్తున్నందుకు బెల్లంపల్లి ఏరియా ఖైరగుడా ఓపెన్ కాస్ట్ లో బాణాసంచా కాల్చి ముఖ్య మంత్రి కెసిఆర్ చిత్రపటానికి టీజీబీకేష్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగిందని టీజీబీకేష్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస రావు తెలిపారు. అనంతరం సింగరేణి లాభాలలో 27 శాతం కార్మికులకు పంచడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీజీబీకేష్ గౌరవ అధ్యక్షురాలు ఎం పి కవిత, అధ్యక్షులు వెంకట రావు మిరియాల రాజి రెడ్డి ,ల కృషివల్లనే సాధ్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో సదశివ్ ,రాజన్న,వెంకటేష్, తాళ్లపల్లి రాములు,మహబూబ్,చిన్నయ్య,అంజయ్య,స్వామి, కార్నాథమ్ వెంకటేష్, దత్తు,పసుల శంకర్,సమ్మయ్య, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సౌకర్యార్ధం మరుగు దొడ్లు నిర్మించాలి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 27 ; మండల కేంద్రంలో మరుగు దొడ్లు నిర్మించాలని కోరుతూ సి పి ఐ , ఆ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ సాయన్నకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్, రెండు బ్యాంకు శాఖలు, ఒక సహకార బాంక్, బస్సు స్టాండ్, రైల్వే స్టేషన్ ఉండడంతో మండలం లోని గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో వస్తారని, కానీ మండల కేంద్రంలో మరుగు దొడ్లు లేకపోవడంతో ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావున ప్రజల సౌకర్యార్ధం మరుగు దొడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి పి ఐ మండల కార్యదర్శి రాయిలా నర్సయ్య, ఆ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, నాయకులు జాడి సాయి, రమేష్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాచకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Sunday, 26 August 2018
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రక్షాబంధన్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 26 ; తెలంగాణ జాగృతి వారి ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ అధికార ప్రతినిధి కె.నరేందర్ గౌడ్, పి.ఆర్.ఓ కనుకుట్ల వెంకటేష్ టి.జె.ఎస్.ఎఫ్ మండల అధ్యక్షులు జావిద్ అలీ ఖాన్ మాట్లాడుతు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు జాగృతి జిల్లా అధ్యక్షులు పర్ష. చంద్రశేఖర్ సూచనలతో నేడు ఈ కార్యక్రమాన్ని బెజ్జుర్ మండల కేంద్రం లోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం అక్కాతమ్ముళ్ల సంబంధం విడదీయరాని ప్రేమానురాగాలు మరచిపోలేని మమతానురాగాలు ఈ పండగలో కనిపిస్తాయని అని అన్నారు. నాకు నీవు రక్ష నీకు నేను రక్ష మనం ఇద్దరం ఈ దేశానికి రక్ష అంటూ విద్యార్థినిలకు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి విద్యార్థి సమైక్య మండల అధ్యక్షులు జావిద్ అలీ, వనవాసి కళ్యాణ్ పరిషద్ కాగజ్నగర్ నియోజకవర్గం నాయకులు పోల్కా.వెంకటేష్ ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్ధిరామ్ అధ్యాపకులు విద్యార్థినిలు ఉన్నారు.
ఆనందోత్సాహాలతో రాఖీ పండుగ
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 26 ; రెబ్బెన మండలంలో రాఖీ పౌర్ణమిని ఆనందోత్సహాలతో జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్ల అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉదయం నుంచి మండలంలోని మిఠాయి దుకాణాలు, రాఖీలు అమ్మే షాప్ ల వద్ద జనసందోహం కనపడింది. ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలలో ఉన్న అన్నదమ్ములు, అక్కాచెలెళ్ళు తమ తమ ఇండ్లకు వెళ్లి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సింగరేణి కార్మిక క్రీడాకారులకు పోటీలు
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 26 ; బెల్లంపల్లి సింగరేణి ఏరియా డబ్ల్యూ పి ఏ అండ్ జి ఏ ఆధ్వర్యంలో కార్మిక క్రీడాకారులకు బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, క్యారమ్ మరియు కల్చరల్ విభాగాలలో పోటీలు రెబ్బెన గోలేటి సీ ఈ ఆర్ క్లబ్ లో ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందినవారు నియర్ బై ఏరియా పోటీలలో పాల్గొంటారని డిజిఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందినవారిని జీఎం కె రవిశంకర్, హానరరీ సెక్రటరీ రాజేశ్వర్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్అదికారి గోపికృష్ణ, ఎన్విరాన్మెంట్ అధికారి కె కృష్ణాచారి, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను స్పోర్ట్స్ సూపెర్వైజర్ హెచ్ రమేష్ ,స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ జి పి చంద్రకుమార్ లు నిర్వహించారు.
Saturday, 25 August 2018
మొక్కల పెంపకంపై అవగాహన పెంపొందిచుకోవాలి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 25 ; పర్యావరణం, మొక్కల పెంపకంపై అవగాహన పెంపొందించుకోవాలని రెబ్బెన ఎంపీడీవో సత్యనారాయణసింగ్, మండల విద్యాధికారి వేంకటేశ్వరస్వామి లు అన్నారు. శనివారం రెబ్బెన మండలం నక్కలగూడ గ్రామా ప్రాధమిక పాఠశాల విద్యార్థులు శనివారం గ్రామంలో నిర్వహించిన హరిత హారం ర్యాలీ లో పాల్గొని మాట్లాడారు..విద్యార్థులు మొక్కలకు నీళ్ళుపోసి పెంచి పెద్ద చేసే అలవాటు పెంపొందించుకోవాలని అన్నారు. అనంతరం విధ్యార్దులతో మరియు గ్రామస్తులతో హరితహారం ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి, అక్తరోద్దిన్, బీట్ అధికారులు రవి, మహేష్, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ ఈ పోషమల్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్, ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ , విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 25 ; తెలంగాణా ప్రభుత్వం మజీద్ ఇమాం మరియు మొజన్ లకు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల కు గౌరవ వేతనాన్ని ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రెబ్బెన మండల కేంద్రంలోని మజీద్ ఎదుట శనివారం ముఖ్య మంత్రి కె చంద్ర శేఖర్ రావు చిత్రపటానికి పాలబిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తున్నది అన్నారు. ఈ కార్యక్రమంలోరెబ్బెన మైనార్టీ నాయకులూ ఎం డి జహీర్ బాబా.మన్సుర్, ముబారక్, బారి కయత్ అలీ, యాకూబ ,ఇక్బాల్, అప్పు, తెరాస నాయకులూ భొమ్మినేని శ్రీధర్.నవీన్ జేస్వల్, మోడెమ్ చిరంజీవి గౌడ్ .ముడేపల్లి తిరుపతి.తోట లక్ష్మణ్, వినోద్ జైస్వాల్ .పెసరమధునయ్య.రంగు మహేశ్.కర్నాధం చంద్రయ్య ,అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలో రక్షాబందన్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 25 ; రెబ్బెన మండల కేంద్రంలోని సాయి విద్య లయంలో శనివారం రక్షాబంధన్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దీకొండ విజయకుమారి మాట్లాడుతూ అన్నదమ్ముల క్షేమాన్ని కోరుతూ అక్క చెల్లెల్లు వారికీ రక్షాబంధనం చేస్తారని ఆన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజాత, విష్ణు, మహేందర్, లిఖిత, ఉదయ, రేష్మ, తిరుపతి, ఆనందరావు, భాగ్యలక్ష్మి, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్షాబంధన్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 25 ; రెబ్బెన మండలంలోని ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కాలేజీలో బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు.విద్యార్థినీలతో విద్యార్థులకు రాఖీలను కట్టించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా, రక్త సంబంధం ఉన్నా లేకున్నా , సంబంధాన్ని పెంచే పండగ రక్షాబంధన్ అన్నారు. అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్ళకు ప్రేమానురాగాలకు సూచికగా ఈ పండుగ జరుపుకుంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మాన్, సంస్థ సభ్యులు పెంటపర్తి తిరుపతి, రాంటెంకి సంజయ్, బొడ్డు శ్రీకాంత్, కళాశాల ఉపాధ్యాయులు దుర్గం దేవాజీ, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Friday, 24 August 2018
వాలీ బాల్ కిట్ ల పంపిణి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 24 ; రెబ్బెన మండలం లోని పుంజు మేర గూడ గ్రామ యువకులకు శుక్రవారం తెరాస నాయకుడు ఆత్మారాం నాయక్ వాలీ బాల్ కిట్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో క్రీడా సామాగ్రిని అందచేయడం జరుగుతుందన్నారు. క్రీడా సాధన ద్వారా యువకులు ఆరోగ్యకరం గా ఉండడంతో పాటు చేడు వ్యసనాల బారిన పడకుండా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు భిక్షపతి , వెంకటేష్, సురేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఆటో బోల్తా ఆరుగురికి గాయాలు
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 24 ; రెబ్బెన మండలం రాళ్లపేట సమీపంలో శుక్రవారం ఆటో డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం మూలంగా ఆటోఏ పి 01 వై 2172 బోల్తా పడి ఆరుగురికి గాయాలైనట్లు ఎస్సైదీకొండ రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కాగజ్ నగర్ నుండి రెబ్బెన కు వస్తున్న ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న వి రాజలింగు, సంతోష్, సత్యనారాయణ, కళావతి, మౌనిక, పోశెట్టి లు తీవ్రంగా గాయపడడం జరిగిందన్నారు. భాదితులను రెబ్బెన సర్కిల్ ఇన్స్ఫక్టర్ రమణ మూర్తి తన వాహనంలో ఆసిఫాబాద్ ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. గాయపడిన రాజా లింగు ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ రెడ్డి శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా గాయపడినవారందరు మండలంలోని నవేగం గ్రామానికి చెందినవారు.
ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు డి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 24 ; రెబ్బెన మండలం ఖైర్గాన్ సమీపంలో శుక్రవారం ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ధీ కొనడంతో డ్రైవర్ నరసింహా రావు కు గాయాలు కావడం జరిగిందని రెబ్బెన ఎస్సైదీకొండ రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఉత్త ప్రదేశ్ నుండి ఆంధ్ర ప్రదేశ్లోని గుడివాడకు వెళ్తున్న ఏ పి 16టి పి 2259 లారిని ఎదురుగావస్తున్నా ఏ పి 16 టి ఎఫ్ 6989 లారి డ్రైవర్ అతి వేగంగా అజాగ్రత్తగా వచ్చి ఢీకొనడం జరిగిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భక్తి శ్రద్దలతో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజలు
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 24 ; అత్యంత భక్తి శ్రద్దలతో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి రెబ్బెన మండలంలోని ప్రజలు వ్రతాలు చేసుకున్నారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయంనుంచే భక్తులు డైవదర్శనంచేసుకొని వారి వారి ఇండ్లలో వరలక్ష్మిఅమ్మవారి పూజ చేసుకొని, ముత్తైదువులకు తమ శక్తానుసారం వాయినాలు సమర్పించారు. మండలంలోని ఇందిరానగర్ శ్రీ కనకదుర్గ దేవి శ్రీ స్వయంభూ మహంకాళి అలయలో, వర లక్ష్మీ వ్రత పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి దేవార వినోద్, మరియు ఆలయ కమిటీ అధ్య క్షులు మోడెం తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు కొట్రంగి శ్రీనివాస్, రెబ్బెన ఏం. పి. పి సంజీవ్ కుమార్, మొడెం సుదర్శన్ గౌడ్, సురేష్, మధుకర్, రమేష్, రెబ్బన వోకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్దులు, ఊపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామ నవ నిర్మాణ సమితి ఆద్వర్యం లో హరితహారం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 24 ; రెబ్బెన మండలం నంబల గ్రామంలోని శివాలయం ఆవరణ లో గ్రామ నవ నిర్మాణ సమితి ఆద్వర్యం లో శుక్రవారం సుమారు 50 మొక్కలను నాటి హరితహారం కార్యక్రమని నిర్వహించారు. ఈ సందర్భంగా . సమితి అధ్యక్షులు ఇంగు జగదీష్, ప్రధాన కార్యదర్శి కుమ్మరి పెంటయ్య లు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డ్లు పెడతామని, మొక్కలు ఎండి పోకుండా చూస్తామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గ్రామంలోని యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకమని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లు రవి, మహేశ్ అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ నవ నిర్మాణ సమితి ఉప అద్యక్షుడు ముధాం వెంకటేష్, ఉమ్మడి కార్యదర్శి అడే సోమశేఖర్, కోశాధికారి ఎర్ర సమయ్య, సమితి సభ్యులు గ్రామ యువత పాల్గొన్నారు.
Thursday, 23 August 2018
కంటివెలుగు శిబిరాన్ని సందర్శించిన ప్రేత్యేక అధికారి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 23 ; కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కంటివెలుగు కార్యక్రమం ప్రేత్యేక అధికారి సీతారాం , జిల్లా డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ సుధాకర్ నాయక్ లు అన్నారు. గురువారం రెబ్బెన మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్ర్రార్ధమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన కంటివెలుగు కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రెవేశ పెట్టిన కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు అందిస్తారన్నారు . కంటివెలుగు శిబిరం రికార్డులను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరానికి వచ్చేవారి వివరాలను సరిగా నమోదు చేయాలని, మండలంలోని అందరు కంటి పరీక్షా చేసుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. శిబిరానికి వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మాధురి , హెచ్ వి రూత్ క్లారా , కమల్, ప్రవీణ్, మొయిజ్, ఫార్మసిస్ట్ , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Wednesday, 22 August 2018
ప్రభుత్వ బెదిరింపులకు బయపడం : ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 22 ; గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు గత 31 రోజుల నుంచి తమ హక్కుల కోసం సమ్మె చేస్తుంటే, ప్రభుత్వం విధుల్లోకి చేరకుంటే తొలగిస్తామని బెదిరించడం చేతగాని తనం అని అన్నారు, కేసీఆర్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. కార్మికుల ఆధ్వర్యంలో నిరసన గా బుధవారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగే ఉపేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హక్కులు సాధించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తేలేదని అన్నారు,ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్, మాటకు కట్టుబడి ఉండాలని అంన్నారు,4 ఏండ్ల కాలంలో ఏనాడు పట్టించుకోకుండా శ్రమదోపిడికి గురి చేస్తూ,కార్మిక చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు, ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తూ కార్మికులని గందరగోళానికి గురిచేస్తున్నారని,ఇప్పటికైనా ప్రభుత్వనికి కార్మికులపై ప్రేమ ఉంటే చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని,లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు,8500 జీతం ఇస్తామని చెపుతున్న ప్రభుత్వం..దానిపై ఇప్పటివరకు సరియైన స్పష్టత ఇవ్వ లేదు అని అన్నారు. ప్రభుత్వం కార్మికులపై సవితి తల్లి ప్రేమ చూపించడం సరి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ కె వి జిల్లా కార్యదర్శి నగవేల్లి సుధాకర్,ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య,గ్రామ పంచాయతీ మండల ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్,సహాయ కార్యదర్శి పోశం, కోశాధికారి కళావేని తిరుపతి నాయకులు ప్రకాష్,బాబాజీ,దేవాజి, శంకర్ లు ఉన్నారు.
అత్యంత భక్తి శ్రద్దలతో బక్రీద్
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 22 ; రెబ్బెన మండలంలోని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో బక్రీద్ పండుగను బుధవారం జరుపుకున్నారు. . గ త్యాగానికి ప్రతిక ఇద్ ఉల్ అజహా (బక్రీద్) ను ఇస్లాంమాసం జిల్ హజ్జ లో జరుపుకుంటారు. మక్కా లో ముస్లింలు అల్లాహ్ ఇల్లు ఐన కబంతుల్లా దగ్గర ప్రదక్షిణాలు చేస్త్తారు. మండల కేంద్రంలో మరియు మండలంలోని గ్రామాలలో ముస్లింలు ఈద్గాల వద్దకు వెళ్లి ప్రేత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు,ప్రజలు ముస్లింసోదరులకు పండగ సుహకాంక్షలు తెలిపారు.
Tuesday, 21 August 2018
కేరళ వరద బాధితుల కోసం విరాళల సేకరణ

మనస్తాపంతో సింగరేణి కార్మికుడి మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 21 ; ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కారుణ్య నియామకాలల్లో భాగంగా ఆరోగ్యం సహకారించక మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్న కార్మికులను అన్ ఫిట్ చేయవలసి ఉండగా, కార్మికులను అన్ ఫిట్ చేయకుండా దానికి బిన్నంగా సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తుందని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి అన్నారు. డి.లింగయ్య అనే కార్మికుడు కైరిగుడా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో కన్వేయర్ ఆపరేటర్ గ విధులు నిర్వహిస్తూ ఆరోగ్యం బాగాలేదని మెడికల బోర్డుకు దరఖాస్తు చేసుకోగా యాజమాన్యం అన్ ఫిట్ ఫర్ కన్వేయర్ ఆపరేటర్ , ఫిట్ ఫర్ జనరల్ మాజ్దూర్ ఇచ్చినందున మనస్థాపానికి లోనైన కార్మికుడు మరణించడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం, గుర్తింపు సంఘం అయిన టీబీజీకేఎస్ బాధ్యత వహించాలని ఏఐటీయూసీ గా డిమాండ్ చేస్తున్నామని అని అన్నారు. మెడికల్ బోర్డ్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికున్ని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు.
పాఠశాల సంప్ లో పడి చిన్నారి మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 21 ; రెబ్బెన మండలం కొండపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం దీక్షిత అనే 3 సంవత్సరాల చిన్నారి ప్రమాదవశాత్తు నీటి సంప్ లో పడి మరణించిందని రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కొండపల్లి ప్రాధమిక పాఠశాలలో స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్నపద్మ మధ్యాహ్న సమయంలో బాలికను వెంటతీసుకుని వెళ్లి సంప్ మూతతీసి మరుగుదొడ్లు శుభ్రం చేస్తుండగా బాలిక ప్రమాదవశాత్తు సంప్ లో పడటంతో అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు హుటాహుటిన ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తర లించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారని తెలిపారు. సంఘటన స్థలాన్ని రెబ్బెన ఇన్సపెక్టర్ రమణ మూర్తి పరిశీలించారు.
ప్లకార్డులతో గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 21 ; గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాలని కోరుతూ రెబ్బెన మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న కార్మికులు మంగళ వారం ప్లకార్డు లు పట్టుకొని నిరసన తెలిపారు. నిరవదిక సమ్మె మంగళ వారానికి 30 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, మాట్లాడుతూ ముఖ్యమంత్రి కి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చేయాలని అన్నారు. అలాగే మంత్రి కే టి ఆర్ కు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చేయాలని కోరారు. కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని, అర్హులైన వారందరిని పంచాయతీ కార్యదర్శి గా నియమించాలి అని కోరారు. పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్లు వేతనాలు ఇవ్వాలని, కర్ణాటక రాష్ట్రము వలే ప్రత్యేక గ్రాంట్ కేటాయింపు చేయాలని అన్నారు. హక్కులు సాధించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని అన్నారు. ముఖ్యమంత్రి రోజుకో ప్రకటన చేస్తూ కార్మికులను గందరగోళం గా తయారు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్,లాలు సింగ,కోశాధికారి కళావేని తిరుపతి, నాయకులు బాబాజి,సత్యయ్య ,వెంకటేష్ తదితరులు ఉన్నారు.
సేవా దృక్పధంతో సమాజ సేవకు ముందుకు రావాలి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 21 ; సేవా దృక్పధంతో మండల తెరాస మహిళా విభాగం నుంచి ప్రతి మంగళవారం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉపాహారం పంపిణి నిర్వహిస్తున్నవారిని ఐ కె పి వెలుగు కార్యక్రమం ఏపిఎం వెంకటరామణ శర్మ అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని ఉప్మా పంపిణి కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ మండలం లోని ప్రజలు వీరి స్ఫూర్తి తో మరింతమంది సమాజ సేవకు ముందుకు రావాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, తెరాస మండల మహిళా టౌన్ అధ్యక్షురాలు మన్యం పద్మ, అన్నపూర్ణ అరుణ, ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ మాధురి, సూపర్ వైజర్ భాగ్య లక్ష్మి, రాజేశ్వరి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని వినతి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 21 ; రెబ్బెన మండలం గోలేటి గ్రామపంచాయతీలో నెలకొన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగే ఉపేందర్, బీజేపీ జిల్లా కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ రెబ్బెన ఎంపీడీవో కు వినతి పత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంచాయతీ పరిధిలోని రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ముఖ్యంగా భగత్ సింగ్ నగర్ లో పరిస్థితి దారుణంగా ఉన్నారు. గత సంవత్సర కాలంగా మరుగు దొడ్లు నిర్మించుకున్నవారికి బిలులు చెల్లించడం లేదని అన్నారు. గత రెండు నెలలనుంచి త్రాగునీరు రావడంలేదని, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పై సమస్యలను వెంటనే పరిష్కరింహాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తిని రాము, గట్టు ప్రభాకర్, ప్రసాద్, శ్యామరావు , రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కేరళ వరద బాధితుల కోసం విరాళాల సేకరణ
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 21 ; రెబ్బెన మండలం లొ బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కేరళలోని వరద బాధితుల కోసం విరాళాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. గోలేటి దుకాణాలలో మరియు రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు జడ్పీఎస్ఎస్ పాఠశాలలో విరాళాలు సేకరించడం జరిగింది. సేకరించిన అటువంటి విరాళాలు మరియు దుస్తులు సబ్బులు నిత్యావసర సరుకులు జిల్లా కలెక్టర్ గారి ద్వారా పంపడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మానవత్వం తో తోచినంత సహాయం చేయాలని వారు కోరారు. వాళ్లకి మనం ఒక పూట అన్నం పెట్టిన వాళ్లమవుతాం . మనం వృధాగా ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాం. వృథాగా చేస్తే అటువంటి ఖర్చులు వీరి కోసం సహాయం చేయాలని కోరారు. సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ కుమార్ , ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్, రవీందర్ ప్రధాన కార్యదర్శి జనగామ అజయ్, సభ్యులు పి.తిరుపతి ,s.రాజేష్ ,e.తిరుపతి,సత్యనారాయణ,b. తిరుపతి. తదితరులు పాల్గొన్నారు.
Monday, 20 August 2018
మంచిర్యాల ముంపు గ్రామాలలో పంపిణీకి సామగ్రి సిద్ధం
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 20 ; ఇటీవల కురిసిన భారీవర్షాలకు మంచిర్యాల జిల్లాలో ముంపునకు గురైన గ్రామాలలో పంచిపెట్టడానికి వంట సామాగ్రి, దుప్పట్లు మొదలైన సామానుల ను సిద్ధంగా ఉంచినట్లు బెల్లపల్లి సింగరేణి ఏరియా గోలేటి జనరల్ మేనేజర్ కే రవిశంకర్, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు చింతల శ్రీనివాస్, సింగరేణి సేవ సంఘం అధ్యక్షురాలు శ్రీమతి అనిరాధా రవిశంకర్ లు సోమవారం తెలిపారు. మంచిర్యాల జిల్లాలో గత 10 రోజులనుండి కురుస్తున్న భారీ వర్షాలకు పలు అటవీ గ్రామాలు ముంపునకు గురయ్యాయని, మానవతా దృక్పధంతో సహాయంచేయాలని మంచిర్యాల పాలనాధికారి ఆర్ వి కర్ణన్ విజ్ఞప్తికి స్పందించిన ఏరియా అధికారుల సంఘం వారు ఇచ్చిన 58,000 రూపాయల విరాళంతో గృహోపకరణ సామాగ్రి, దుప్పట్లు,బిస్కట్ లు తదితర వస్తువులు కొనుగోలు చేసి పంపిణి కి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ పర్సనల్ జె కిరణ్, డిజిఎం లు ప్రసాదరావు, రాజై, ఫైనాన్స్ మేనేజర్ శ్రీధర్, ఎస్టేట్ ఆఫీసర్ వరలక్ష్మి, డి వై పి ఎం లు రాజేశ్వర్, రామసాస్ట్రీ తదితరులు పాల్గొన్నారు.
Sunday, 19 August 2018
పాతనేరస్తులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి ; సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 19 ; పాతనేరస్తులు సత్ప్రవర్తన కలిగి ఉండాలని రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి అన్నారు. మండలం లోని పాత నేరస్తులతో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్సపెక్టర్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికలు, బక్రీద్, వినాయక చవితి, విజయ దశమి తదితర పండుగల సందర్భముగా ఎటువంటి అవాంఛనీయ, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని అన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై దీకొండ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వాలు కార్మికులకు చేస్తున్న ద్రోహాలఫై హైదేరాబద్ లో 9న భారీ బహిరంగ సభ ; ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు
కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 19 ; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు చేస్తున్న ద్రోహాలను వివరిస్తామన్నారు. సెప్టెంబర్ 9 న హైదేరాబద్ లో జరిగే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు అన్నారు. ఏఐటీయూసీ చేపట్టిన ప్రచార యాత్ర అదివారం గోలేటి క్రాస్ రోడ్ చేరుకున్న సందర్భంగా కూడలి వద్ద జండా ఎగురవేశారు. అనంతరం రెబ్బెన గ్రామానికి చేరుకున్న యాత్ర ప్రధాన కూడలి వద్ద ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు మాట్లాడారు. అలాగే మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా దీక్షలో ఉన్న గ్రామ పంచాయతీ ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించి వారికీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులూ మాట్లడుతూ గత 28 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పై సమ్మె చేస్తున్న వారికీ ప్రభుత్వం స్పందించాలని అన్నారు.కార్మికుల సమస్యలపై నిరంతరంఏఐటీయూసీ పోరాడుతుందన్నారు. ఈ నెల 9 న యాత్రను చేపట్టామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్లి ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు చేస్తున్న ద్రోహాలను వివరిస్తామన్నారు. సెప్టెంబర్ 9 న హైదేరాబద్ లో జరిగే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని అన్నారు. కార్మిక సోదరులు ఈ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు,ఉప ప్రధాన కార్యదర్శి S. బలరాజ్,రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్, విలాస్, కరుణకుమారి,ఉపాధ్యక్షులు సీతారామయ్య,జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, మండల కార్యదర్శి రాయిల్లా నర్సయ్య,జిల్లా కార్యదర్శి నగవేల్లి సుధాకర్, ఏఐటీయూసీ GP వర్కర్స్ యూనియన్ మండల ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,కార్యదర్శి వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ శంకర్,లాలూ సింగ్, AISf డివిసిన్ ప్రెసిడెంట్ పుదారి సాయి కిరణ్, వైస్ ప్రెసిడెంట్ పరవతి సాయి ,జగ్గయ్య, కిరణ్, రాజేష్ లతో పాటు తదితరులు ఉన్నారు.
Subscribe to:
Posts (Atom)