కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 13 ; బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపచేసిన తెలంగాణ ముద్దుబిడ్డ, బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయొద్దని పార్లమెంటులో గట్టిగా మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా బెల్లంపల్లి ఏరియా టి బి జి కే ఎస్ వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాస్ రావు శుభాకాంక్షలు తెలిపారు. . బెల్లంపల్లి సింగరేణి ఏరియాలో టి బి జి కే ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. .మంగళవారం బెల్లంపల్లి ఏరియా లోని అన్ని గనులు మరియు విభాగలపై కేక్ కట్ చేసి కవితక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొర్లిఓసీపీ లో పిట్ కార్యదర్శి నర్సింగరావు, ఖైరగుడా ఓసీపీ లో పిట్ కార్యదర్శి తాళ్లపల్లి రాములు అబ్బాపూర్ లో పిట్ కార్యదర్శి ఏలూరు రవి, స్టోర్ లో పిట్ కార్యదర్శి గోపాల కృష్ణ సి హెచ్ పి లో పిట్ కార్యదర్శి శివకుమార్, సెక్యురిటి డిపార్ట్మెంట్ లో మంగిలాల్, వర్క్ షాప్ లో చంద్ర శేఖర్ లు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంగిలాల్ చర్చల ప్రతినిధి, మరియు జీఎం కమిటీ మెంబర్లు మరియు నాయకులు ప్రకాష్ రావు, సదాశివ్, సమ్మయ్య,ఛార్లెస్, శ్రీనివాస్ రెడ్డి,బైరి శంకర్,సంపత్,కొందు సత్తయ్య,అన్నం లసుమయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment