Sunday, 18 March 2018

తెలంగాణ ప్రభుత్వ పథకాల నిధులన్నీ కేంద్ర ప్రభుత్వనిధులే

  కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 18 ;  తెలంగాణా ప్రజలకి అందుతున్న  సంక్షేమ పథకాల నిధులన్నీ  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం  ద్వారానే అందుతున్నాయని బీజేపీ రెబ్బెన మండల అధ్యక్షులు కుందరపు బాలకృష్ణ అన్నారు.  ఆదివారం రెబ్బెన మండలం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. మొన్న నిర్వహించిన కొమురం భీం జిల్లా బీజేవైఎం కొర్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా బీజేవైఎం కార్యదర్శి గా  వాడయి గొండయ్య ను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్బంగా  గొండయ్య  మాట్లాడుతూ జిల్లాలో ని బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు . ఈ కార్యక్రమం లో  బీజేవైఎం రెబ్బెన మండల అధ్యక్షులు  ఇగురపు  సంజీవ్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ  గారి నాయకత్వలో  ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు మరియు రాష్ట్రాల అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీ ని తెలంగాణాలో 2019 ఎన్నికలలో   గెలిపిస్తారని  అన్నారు  ఈ కార్యక్రమం లో బీజేపీ రెబ్బెన టౌన్ ప్రధానకార్యదర్శి  పసుపులేటి మల్లేష్,  బీజేపీ మండల ఉపాధ్యక్షులు పందిర్ల కనకయ్య,  బీజేవైఎం రెబ్బెన మండల ప్రధానకార్యదర్శి  వాడయి కాంతారావు  లు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment