Saturday, 3 March 2018

సింగరేణి సేవాసమితి అద్వర్యం లో మహిళకు ఆటల పోటీలు


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 3 ; బెల్లంపల్లి ఏరియా గోలేటిటౌన్ షిప్ సింగరేణి పాఠశాల ఆవరణలో సింగరేణి సేవా సమితి అద్వర్యం లో 08-03-2018 రోజున మహిళా దినోస్సవాన్ని నిర్వహిస్తున్నట్టు సింగరేణి ఏరియా డిజియం పర్సనల్ శ్రీ జె కిరణ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా మహిళలకు,చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ యొక్క పోటీలు గోలేటి,మాధారం,మరియూ బెల్లంపల్లి ఏరియా లలో నిర్వహిస్తున్నామన్నారు. తేది:03-03-2018 నాడు గోలేటి సింగరేణి పాఠశాల మైదానం నందు సాయంత్రం 4 గం:గంటల నుండి. తేదీ:04-03-2018 నాడు మాధారం మినీ మైదానం నందు సాయంత్రం 4 గం:నుండి. తేదీ 05-03-2018 నాడు బెల్లంపల్లి ఏఎంసి మైదానం నందు సాయంత్రం 4 గం: నుండి. ఈ యొక్క పోటీలను నిర్వహిస్తున్నట్టు.ఈ యొక్క ఆటల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ పోటీల్లో గెలుపొందిన వారికీ మార్చ్ 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోస్సవం నాడు గోలేటిలో జరిగే కార్యక్రమము లో జియం కె రవిశెంకర్ సేవ అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ రవిశెంకర్ చేతుల మీదుగా బహుమతి ప్రధానోస్సవం ఉంటుందని తెలిపారు..

No comments:

Post a Comment