Saturday, 24 March 2018

సింగరేణి కార్మిక క్వాటార్లలో విద్యుత్ చర్జిలు రద్దు


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 24 ; సింగరేణి కార్మిక నివాస గృహలలో  విద్యుత్ చర్జిలు విధించటానికి సంస్థ రద్దు చేసినట్లు టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు మాల్రాజ్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం రెబ్బెన మండల గోలేటిలోని విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి క్వాటార్లలో  నివాసం ఉండే కార్మికులు ప్రతి నెలా సంస్థ విధించే  విద్యుత్ చార్జీలను నేటి నుండి రద్దుచేసినట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ గత నెలలో శ్రీరాంపూర్లో కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించిన విధంగా సింగరేణి యాజమాన్యం విద్యుత్ చార్జీలను రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. సంస్థలో పనిచేస్తున్న నలభై వేల మంది కార్మికులకు నెలకు రూపాయలు ఐదొందల నుండి జన్మింతురు ప్రయోజనం పొందుతుందన్నారు కెసిఆర్ ద్వారా సింగరేణి సంస్థకు మనుగడ కార్మికులు భరోసా ఏర్పడుతున్నరు.

No comments:

Post a Comment