Sunday, 18 March 2018

బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 18 ;     రెబ్బెన మండలం గోలేటి బస్టాండ్ లో ఉగాది సందర్బముగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ అధ్యక్షులు ఒరగంటి రంజిత్ ఆద్వర్యం లో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అలాగె బస్టాండ్ లో దుకాణాలలోకి వెళ్లి పంపిణీ చేసారు. అధ్యక్షులు రంజిత్ మాట్లాడుతూ నూతన సం.. ఐన ఉగాది హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన పండగ  ఆరు రకాల కలయిక ఉగాది పచ్చడి వేసవి వ్యాధుల నుండి రక్షణ అందిస్తుంది.  అందరూ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జె.బి పౌడెల్ , పోటు శ్రీధర్ రెడ్డి, సంస్థ గౌరవ అధ్యక్షులు లక్ష్మణ చారి , ఉపాధ్యక్షులు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి, రవీందర్ ,అజయ్ , సహాయ కార్యదర్శి, విజయ్ , తిరుపతి ,  సత్తిష్, రవి, అఖిల్, సంజు, శ్రీరాం, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment