Monday, 19 March 2018

సింగరేణి కమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో ఆణిముత్యాలు టెలీ ఫిల్మ్



కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 19 ; బెల్లంపల్లి ఏరియా గోలేటి సింగరేణి  జనరల్ మేనేజర్ కార్యాలయం ఆవరణలోకమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో ఆణిముత్యాలు అనే టెలిఫిలిం ను సోమవారం  జి ఎం కె రవిశంకర్ క్లాప్ కొట్టి ప్రారంభించారని ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు.భూ నిర్వాసితులకు సింగరేణి యాజమాన్యం కల్పిస్తున్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు, సౌకర్యాల గురించి మరియు వృత్తి విద్యా కోర్సులు ఉద్యోగ అవకాశాలు  కల్పించే చోట ఈ ఫిలిం నిర్మించడం జరుగుతుంది అని అన్నారు. ఆణిముత్యాలు టెలిఫిలిం కు  జయశంకర్ స్విచ్ ఆన్ చేసారు.  ఈ టెలిఫిలిం కి డైరెక్టర్ మరియు సినిమాటోగ్రఫీ డిటి వెంకటస్వామి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో  ఎఫ్ఎం శ్రీధర్,  డీవైపీఎంలు సుదర్శన్ , రామశాస్త్రులు,  జిఎం పిఎ పాపన్న,  కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ డి కుమారస్వామి  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment