Saturday, 3 March 2018

నేర రహిత సమాజం కోసం తోడ్పాటునందించాలి

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 3 ; తెలంగాణ రాష్ట్రాన్ని నేర రహిత అవినీతి లేని సమాజంగా తీర్చిదిద్దేందుకు జైళ్లశాఖ చేపట్టిన బృహత్తర కార్యక్రమంలో బాధ్యతా యుతమైన పౌరులంతా భాగస్వాములు కావాలని ఆసిఫాబాద్ ప్రత్యేక ఉప కారాగార పర్యవేక్షణ అధికారి శ్రీ రామకృష్ణ రెడ్డి  శనివారం ఆసిఫాబాద్ లో జరిగిన    సమావేశంలో పేర్కొన్నారు.    తెలంగాణ సాంస్కృతిక సామాజిక అభివృద్ధికై  సహకారం అందించాలనే పౌరులు,  అనుకోకుండా గతంలో నేరస్తులుగా ముద్రపడిన వారు తమ చేయూతను అందించేందుకు 7013801538, 779487456 ,8185813141 చరవాణి సంఖ్యల్లో పీటర్ రమేష్ లను  సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిటిజెన్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు మూడెడ్ల రమేష్, అంకం సందీప్, అనిల్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment