కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 12 ; కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయము లో సోమవారం నాడు ప్రజా ఫిర్యాదు ల విబాగం ను నిర్వహించి , ప్రజా ఫిర్యాదు విబాగం కు వచ్చిన ఫిర్యాదుధారుల యొక్క ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పి గోద్రు మాట్లాడుతూ ప్రజావాణి కు వచ్చే ఫిర్యాదు దారుల సమస్యలపైన వారికి బాసట గా నిలవాలని , వారికి సాంత్వన చేకూరేలా చర్యలను తీసుకోవాలని అన్నారు. స్థానిక ప్రజా ఫిర్యాదు విబాగం లో బాపు అప్పపెల్లి ఆసిఫాబాద్ మండలం నుంచి తనను మరియు తన కూతురు ను కొంత మంది బెదిరిస్తున్నారని వారి పైన చట్ట పరమైన తగిన చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేసారు, బిట్ల పోసక్క నంబాల గ్రామము నుంచి తమ కు వారసత్వం గా సంక్రమించిన భూమిని కొంతమంది దొంగ సంతకాలతో ఫోర్జరీ చేసి తమ భూమి కాజేస్తున్నారని ఫిర్యాదు చేసారు, గంగారం గ్రామము దంతాన్ పల్లి మండలం తిర్యాని నుంచి విక్రయించిన ట్రాక్టర్ యొక్క డబ్బులను ఇవ్వకుండా మోసం చేసారు అని ఫిర్యాదు చేసారు. రాంటెకి సావిత్రి గ్రామము మాధవాయ్ గూడ రెబ్బెన మండలం నుంచి తమకు విక్రయించిన వారు ఒక సర్వే భూమిను చూపి మరో సర్వే నెంబర్ లో భూమి ను రిజిస్టర్ చేయించారని ఫిర్యాదు చేసారు మరియు చునార్కర్ అవ్వాజి గ్రామము అప్పపెల్లి ఆసిఫాబాద్ మండలం నుంచి తమ యొక్క భూ సమస్య ను పరిష్కరించమని ఫిర్యాదు చేసారు. ఫిర్యాదుదారుల యొక్క సమస్యలను సావదానం గా విన్న జిల్లా అడిషనల్ ఎస్పి తగు సూచనలతో సంబందిత అధికారులకు తక్షణం న్యాయం జరిగేలా చర్యలను తీసుకోమని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదు కార్యక్రమము లో డిఎస్పి సత్యనారాయణ , పోలీస్ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి భక్త ప్రహ్లాద్, ఎస్సై సురేందర్, సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ , ఫిర్యాదుల విభాగం అధికారి సునీత మరియు పీ ఆర్ ఓ మనోహర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment