Friday, 30 March 2018

కొత్త పంచాయతీల ఏర్పాటుపై కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 30 ; రాష్ట్రవ్యాప్తంగా కొత్త పంచాయితీలను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి కొమురంభీం జిల్లా  రెబ్బెన మండల కేంద్రంలో తెరాస నేతలు క్షీరాభిషేకం చేసారు. ఈ సందర్భంగా నాయకులూ మాట్లాడుతూ  పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రజల అందుబాటులోకి పంచాయితీల సేవలు రావాలని భావించి కొత్త పంచాయితీలను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాధం సంజీవ్ కుమార్, సర్పంచులు పెసర వెంకటమ్మ, గజ్జెల సుశీల, ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య,  నాయకులూ మద్ది శ్రీనివాస్, మోడెమ్ సుదర్శన్ గౌడ్, అశోక్, శాంతి కుమార్,  వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment