సిపిఎం జాతీయ మహాసభల పోస్టర్ల విడుదల
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 30 ; ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు హైదరాబాద్ లో జరగజరగనున్న . భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) జాతీయ మహాసభల పోస్టర్లను రెబ్బెన మండల కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అల్లూరి లోకేష్ ఆధ్వర్యంలో గోడప్రతులను విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మహాసభలకు రెబ్బెన మండలం నుండి వివిధ ప్రజాసంఘాలు కార్మిక సంఘాలు రైతులు పెద్దఎత్తున తరలి జయప్రదం చేయలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాదంతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుందని అన్నారు. రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయడం లేదని, అంతేకాకుండా ప్రజా ఉద్యమాలను అప్రజాస్వామికంగా అణచివేస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయడానికి మహాసభలలో చర్చించి ప్రజా ప్రజల పక్షాన నిలబడి ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం దేశ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలకు న్యాయ పరిపాలన అందించే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి మరిన్ని పోరాటాలు చేయడానికి సిపిఎం అఖిల భారత మహాసభలు వేదిక కానున్నాయి . ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుర్గం దినకర్, గొడిసెల కార్తిక్, నాయకులూ భీంరావు ,సతీష్, మహేష్, రాజేందర్, నర్సయ్య, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment