
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 9 ; ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ నెల 13న తలపెట్టిన బందును విజయవంతం చేయాలనీ ఎం ఆర్పీయస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగంపేళ్ళి ప్రభాకర్ అన్నారు. ఎమ్మార్పీఎస్ బంద్ కు సంబందించిన గోడప్రతులను గురువారం రెబ్బెన ఆర్&బి అతిధి గృహంలో విడుదల చేసారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని నమ్మించి నాలుగు సంవత్సరాలైనా పాటించుకొని కేంద్ర నిర్లక్ష్యంపై పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. గత ఇరవైనాలుగు సంవత్సరాలనుండి ఎన్నో ఉద్యమాలు చేస్తున్న పాలక వర్గాలు పట్టించుకోనందుకు ఈ బంద్ కు పిలిపు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులూ ఇగురపు సంతోష్ బొంగు నర్సింగ రావు,గోగర్ల రాజేష్ ,ఇగురపు రమేష్,గోగర్ల ప్రవీణ్ , చిలుముల నర్సింహులు,రోడ్డ శెంకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment