Saturday, 24 March 2018

క్షయ వ్యాధిపై అవగాహనా ర్యాలీ


 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 24 ; క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం  రెబ్బెన మండల  ప్రాధమిక  ఆరోగ్య కంద్రం సిబ్బంది మరియు ఆశాకార్యకర్తలు ఆరోగ్య కేంద్రం  ఎదురుగా  ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా  వైద్య సిబ్బంది  మాట్లాడుతూ క్షయ  ఒక భయంకరమైన జబ్బుఅయినా  దీనికి చికిత్స ఉంది భయపడాల్సిన అవసరం లేదు  అని  అన్నారు. రెండు వారాలకు మించి దగ్గు జ్వరం ఉన్నట్లయితే దగ్గరలోని ఆరోగ్య కేంద్రంలో తెమడ పరీక్ష చేయించుకోవాలని, వ్యాధి నిర్ధారణ  ఆయన వెంటనే చికిత్స అందిస్తారని  అన్నారు. ఈ కార్యక్రమంలో  రెబ్బెన  గ్రామ సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఆసిఫాబాద్ మార్కెట్   కమిటీ వైస్  చైర్మన్ కుందారపు శంకరమ్మ,   అన్నపూర్ణ అరుణ , హెల్త్ వర్కర్లు  వి పావని, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, కమల్ మరియు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment