కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి5 ; భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రెబ్బెన తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా సోమవారం చేపట్టారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయూలు గౌడ్ తహసీల్దారుకి వినతి పత్రం అందచేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో విఫలమయ్యారని అన్నారు. ఎన్నికల సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాలు భూమి, లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం, బిసిలకు రుణాలు ,మండలానికి ముప్పై పడకల ఆరోగ్య కేంద్రం, కేజీ టు పీజీ విద్య, కొత్త తెల్లరేషన్ కార్డు, మరియు మరెన్నో హామీలను ఇచ్చి అమలుపర్చడంలో ఘోరంగా విఫలమైంది అని అన్నారు. కెసిఆర్ ప్రజలను మభ్య పెడుతూ రాష్ట్రానికి ఏం చేయకుండా ఫామ్ హౌస్ కి అంకితమై ప్రజలను మరిచారని అన్నారు. దేశాన్ని మారుస్తానని మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెరాస ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఆ తరవాత దేశాన్ని మార్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్, , కిషన్ మోర్చ జిల్లా అధ్యక్షులు యలమంచిలి సునీల్ చౌదరి రాచకొండ రాజయ్య, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి కిషన్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర స్టడీ సర్కిల్ మెంబర్ మండల మధుకర్, బిజెపి రెబ్బెన టౌన్ అధ్యక్షులు పంబాల శ్రీనివాస్, బిజెపి గోలేటి టౌన్ అధ్యక్షులు ఇగురపు సంజీవ్ బీజేవైయం రెబ్బెన మండల అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment