Thursday, 29 March 2018

సింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి శిక్షణ


 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 29 ; సింగరేణి సేవా సంస్థ ఆధ్వర్యంలో వాల్వో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు బుధవారం గోలేటి టౌన్ షిప్ లో జీఎం కార్యాలయంలో జీఎం రవి శంకర్  సర్ట్ఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ భూనిర్వాసితులతో పాటు కార్మికుల, మాజీ కార్మికుల పిల్లలకు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సంస్థ అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు . ఇందులో భాగంగా సింగరేణి  సేవా సంస్థ ఆధ్వర్యంలో  శిక్షణను అందించామన్నారు.  ఇటువంటి   శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు భవిష్యత్తులో  ఉపాధికి మరింత అవకాశాలు  ఏర్పడుతాయని అన్నారు   శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ దశలవారీగా శిక్షణ అందజేస్తామన్నారు. కార్మిక సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పేందుకు కార్మికులు మాజీ కార్మికుల పిల్లలకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలే  నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ కిరణ్ పీవో మనోహర్ మోహన్ రెడ్డి డివైపిఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment