Thursday, 22 March 2018

హైదరాబాద్ లో సి పి ఐ (ఎం) సెమినార్

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 22 ;   సి పి  ఐ (ఎం) అఖిల భారత మహాసభల సందర్భంగా హైదరాబాద్ లో  ఈ నెల 25  న సెమినార్ జరగనున్నదని కొమురంభీం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు కూస రాజన్నగురువారం తెలిపారు. ఈ సెమినార్ లో తెలంగాణ రాష్ట్రం మరియు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సెమినార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సెమినార్ లో వక్తలుగా  తమ్మినేని వీరభద్రం సి పి  ఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ఎం ఎల్ సీ ,విజు కృష్ణన్ అఖిలభారతియా కిసాన్ సభ జాతీయ కార్యదర్శి, ఎస్ వీరయ్య, ఎడిటర్   నవ తెలంగాణ తెలుగు దినపత్రిక,  డాక్టర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమలో   అల్లూరి లోకేష్, దుర్గం దినకర్, వడ్లూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment