Wednesday, 21 March 2018

విద్యార్థులు క్రీడలలోకూడా రాణించాలి : సర్కిల్ ఇనస్పెక్టర్ పురుషోత్తం చారి

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 21 ;  విద్యతో పాటు విద్యార్థులు క్రీడలలో  ముందుండా లని రెబ్బెన  సర్కిల్ ఇనస్పెక్టర్  పురుషోత్తం చారి అన్నారు.  బుధవారం  రెబ్బెన సాయి విద్యాలయం పాఠశాల తరుపున కుంగ్ ఫు  ,  కరాటే తెలంగాణ  అంతర్ జిల్లా  పోటీల్లో సింగిల్  బెల్లంపల్లి లో నిర్వహించిన సింగిల్ కటాస్ లో   పాల్గొన్న వై హర్షవర్ధన్ 7త్   క్లాస్ గోల్డ్ పథకం మరియూ సాయికిరణ్ 7త్   రజత పథకం సాధించినట్టు సాయి విద్యాలయం పాఠశాల  కరస్పాండెట్ డికొండ సంజీవ్ కుమార్ తెలిపారు అదేవిదంగా  గ్రూప్ పోటీల్లో పాల్గొన్న ఏ శ్రవణ్ కుమార్,కె రోహిత్ కుమార్,కె మణిరాజ్,బంగారు పథకాలు సాధించారని అలాగే  ఎస్ శ్రీశాంక్,పి  విజయ్ కుమార్ ,జి విశాల్ రజత పథకం సాధించినట్టు తెలియజేసారు అదేవిదంగా అల్గామ్ శిరీష జిల్లా రాష్ట్ర స్థాయి కుంగ్  పోటీల్లో మూడు సార్లు బంగారు పథకాన్ని సాధించినదని తెలిపారు గెలుపొందిన విద్యార్థులను బుధవారం రోజున రెబ్బెన సీఐ పురుషోత్తంచారి అభినందించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆటల్లో కూడా విజయాలను సాధించాలని తెలిపారు.

No comments:

Post a Comment