కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) మార్చి 16 ; తెరాస ప్రభుత్వం ఎన్నికల హామీల లో పూర్తిగా విఫలమైందని ఎన్నికల హామీల్లో ఒక లక్ష పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తా మని ఇప్పటివరకు కేవలం పదహారు వేల ఉద్యోగాలే భర్తీ చేయడం జరిగిందని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సంజయ్ ఘనాతె అన్నారు. శుక్రవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపి కార్యాలయంలో బీజేవైఎం జిల కార్యదర్శి ఖాండ్రే విశాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెరాస అధికారంలోకి రావడానికి ఎన్నికలలో ఎన్నో హామీలిచ్చి అధికారం లోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మర్చిపోయారన్నారు. ఇచ్చిన హామీలమేరకు ఉద్యోగాలు కల్పించే వరకు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు అసెంబ్లీ ముట్టడి కూడా చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ నెల ఇరవై మూడున సిర్పూర్యు నియోగ వర్గంలోని చింతలమానెపెల్లి మండలంలోని డబ్బా గ్రామ పంచాయతీలో నిరుద్యోగ యువ గర్జన సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని కొమురమ్మ జిల్లా నుండి బీజేవైఎం జిల్లా కమిటీ మండల అధ్యక్షుడు యువత యువకులు పార్టీ మోర్చా నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. అదే విధంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెబ్బెన గ్రామానికి చెందిన బత్తిని రాము, ఉపాధ్యక్షులుగా సుబాద్ కాంత్, శాంతిలాల్ ముద్దం వెంకటేశ్, శ్రీనివాస్, కార్యదర్సులుగా, మణిరావు, గట్టు రజనీకుమార్ వలి గుండయ్యలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యక్షులు శ్రీధర్, పాల్గొనే బీజేవైయం ఉపాధ్యక్షుడు శ్రీధర్ సోషల్ మీడియా కన్వీనర్ రాధికా, కార్తీక్ రాకేష్, రవిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment