Saturday, 17 March 2018

గ్రామపంచాయితీ కార్యాలయం నందు రైతుల భూమి వివరాలు


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 17 ;  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రమైనరెబ్బెన  గ్రామానికి  సంబందించి ఇటీవల నిర్వహించిన   రైతుల  భూ సర్వేకి సంబందించిన పట్టేదారు యొక్క  వివరాలపట్టికను గ్రామపంచాయితీ కార్యాలయం  నందు  గ్రామంలోని పట్టాదారుల  సౌకర్యం కోసం అందుబాటులో  ఉంచినట్లు  రెబ్బెన గ్రామ పట్వారి ఉమ్లాల్ తెలియజేసారు.రెబ్బెన మండల తహశీల్దార్ సాయన్న  ఆదేశాల మేరకు రైతుల యొక్క భూ వివరాలను పట్టాదారుల వివరాలను అందుబాటులో ఉంచినట్లు  తెలియజేశారు. ఈ వివరాలలో    ఏదైనా కారణాలవల్ల  వల్ల   మార్పులు ఉన్నచో  తహశీల్దార్ కార్యాలయం నందు.సంప్రదించవల్సినదిగా తెలిపారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పేసరి వెంకటమ్మ,సింగిల్ విండో డైరెక్టర్ పేసరి మధునయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment