Thursday, 22 March 2018

రైలు కింద పడి వృద్ధుడి మృతి

కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 22 ;  రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్లో గురువారం గుర్తు తెలియని రైలు కింద పడి ఆసిఫాబాద్ కంచుకోట గ్రామనికి చెందిన జంజిరాల సత్తయ్య అనే వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కాగజ్నగర్  జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ బి మురళీ తెలిపారు.  తెలిపిన వివరాల ప్రకారం సత్తయ్య గత నాలుగు సంవత్సరాలుగా నడుము నొప్పితో బాధపడుతు ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన సత్తయ్య గురువారం ఉదయం రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిపాబాద్ రైల్వే స్టేషన్ల గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

No comments:

Post a Comment