Saturday, 17 March 2018

సింగరేణి లో కాంట్రాక్టు పద్ధతిపై వాహనాలకై టెండర్లు


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 17 ;  బెల్లంపల్లి ఏరియాలోని  గనులు  మరియూ డిపార్టుమెంట్ నందు 16 గంటలు మరియూ 12 గంటలు వాహనాలు నడుపుటకు మల్టి యూటిలిటి వాహనాలు  టూ  వీల్   మరియూ ఫోర్ వీల్  డ్రైవ్ జిపులు కొత్తవాటి కొరకై టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు డిజియం పర్సనల్ జె కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. టెండరు ఫారం కొరకై గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయం లోని పర్చేస్ డిపార్టుమెంట్ నందు సంప్రదించవల్సధీింగా కోరారు.  ఈ నెల ఇరవైమూడవ తేదీ  4 గంటల వరకు టెండరు  ఫారాలు తీసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన టెండరు ఫారములను ఈ నెల ఇరవైనాలుగవ తేదీ  మధ్యాహ్నం పన్నెండు గం"ల లోపల  అందజేయాల్సింది గా కోరారు. అదే రోజున సా"మూడు  గం"లకు టెండరు ఫారములను తెరవనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలకై గోలేటి జియం కార్యాలయం లోని పర్చేస్ డిపార్టుమెంట్ నందు సంప్రదించాల్సిందిగా తెలియజేసారు.

No comments:

Post a Comment