Tuesday, 20 March 2018

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం


 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 20 ; కొమరం భీం జిల్లా: ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి,షాదీ ముభారక్ సాయాన్ని రూ 75 వేల నుంచి రూ లక్ష నూట పదహరుకు పెంచి అసెంబ్లీలో ప్రకటించినందుకుగాను సీఎం కేసీఆర్ చిత్రపటానికి జిల్లాలోని  నాయకులూ  పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల సమయంలో  హామీలను నెరవేరుస్తున్నారన్నారు.  షాదీ ముబారక్ పథకాల వల్ల ఎంతో  మంది ఆడపిల్లల    తల్లి తండ్రులు  కుల మత  వివక్షలేకుండా లబ్దిపొందుతున్నారన్నారు. ఈ  జిల్లాలోని నాయకులూ, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

No comments:

Post a Comment