Monday, 12 March 2018

వి ఆర్ ఏ ల సమస్యలు పరిష్కరించాలి


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 12 ;    వి ఆర్ ఏ ల   సమస్యలు టిఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే    పరిష్కరించాలని సీఐటీయూ   జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ అన్నారు.  .  విఆర్ఎల రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా   సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్  మాట్లాడుతూ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వోల్వో పద్దు క్రింద వస్తున్న వేతనాలకు తొలగించి తీవ్ర ఆ న్యాయం చేసింది వీఆర్ఏలకు కనీస వేతనం రూపాయలు పద్దెనిమిది వేలు ఇవ్వాలని సుప్రీమ్  కోర్టు చెప్పినా పాలకుల చెవికి ఎక్కుత  లేదు  అన్నారు.  విఆర్ఏలను అటెండర్, వాచ్ మెన్   జీపు డ్రైవర్ కంప్యూటర్ ఆపరేటర్ గా ప్రమోషన్లు ఇవ్వాలని వీఆర్ఏలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు  సొంత గ్రామాల్లో కట్టి ఇవ్వాలని, డిఎ అండ్ టి నెలకు ఐదువందల రూపాయలు ఇవ్వాలని అరవై సంవత్సరాల పైబడిన వారికి రిటైర్డ్మెంట్ చేస్తే వారసత్వాల ఉద్యోగాలు పెన్షన్ ఇవ్వాలని విఆర్ఎలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేసారు.  ఈ  కార్యక్రమంలో కె వెంకటేష్, జమీర్ పాషా, దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి ఎం గణపతి, చత్తారి మల్లయ్య, దుర్గం రాజు, దుర్గం జానయ్య  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment