Monday, 12 March 2018

కెసిఆర్ చిత్రపటానికి ముదిరాజ్ కులస్తుల క్షీరాభిషేకం


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 12 ;  ముదిరాజ్ కులస్తులు కొమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో సోమవారం రోడ్ భవన అతిధి గృహ ఆవరణలో కెసిఆర్ చిత్రపటానికి  పాలాభిషేకం నిర్వహించారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో తెలంగాణ నుంచి తమ కులస్తుడైన ప్రకాష్ ముదిరాజ్ కు తెరాస పార్టీ తరపున ముఖ్యమంత్రి కెసిఆర్ తమ అభ్యర్థిగా ప్రకటించినందుకు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానానికి న్యాయంచేస్తూ సమాజంలోని అన్ని కులాలను అభివృద్దిచేయడానికి ఎన్నో పదలకాలు అమలు చేస్తున్న కెసిఆర్ బంగారు తెలంగాణాసాధించి తీరుతారన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ ముదిరాజ్, గోలేటి సర్పంచ్ తోట లక్ష్మణ్ ముదిరాజ్, రెబ్బెన  సింగల్ విండో చైర్మన్ పెసర మధునయ్య ముదిరాజ్ , అంకం స్వామి ముదిరాజ్,   తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment