Monday, 12 March 2018

సిటిజన్ ఫారం అద్వర్యం లో విద్యార్థులకు ప్యాడ్స్ పెన్స్ పంపిణి


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 12 ;  సిటిజన్ ఫోరమ్ అద్వర్యం లో రెబ్బెన మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పదవతరగతి పరీక్షలు రాయబోయే తొంబై మంది విద్యార్థిని విద్యార్థులకు   సోమవారం ప్యాడ్స్ మరియూ పెన్స్ పంపిణి చేసారు. ఈ సందర్బంగా సిటిజన్ ఫోరమ్ తెలంగాణ రాష్ట్ర సభ్యుడు మూడెడ్ల రమేష్ మాట్లాడుతూ పడవ తరగతి  పరీక్షలు రాయబోయే విద్యార్థిని విద్యార్థులు   ఎలాంటి ఆందోళనకు గురి అవ్వకుండా ప్రతి ఒక్క విద్యార్ధి ఉత్తీర్ణత సాధించి చదువుతున్న పాఠశాలకు,చదువు చెప్పిన ఉపాధ్యయూలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నరు విద్యార్థులందరూ ఇప్పటి నుండే మంచి ఆశయాలను ఎంచుకొని వాటికీ అనుగుణంగా నడ్చుకొని మంచి విజయాలను సాధించాలని తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల  ప్రధాన ఉపాధ్యయూరాలు స్వర్ణలత, ఉపాధ్యాయులు యం డి అనీస్,విజయ లక్ష్మి,కవిత,శిరీష,పార్వతి,ప్రభాకర్,ప్రసన్న,జముందం ,మరియ  బంధం వెల్ఫేర్ అస్సోసియేషన్ అధ్యక్షుడు అమ్మ శ్రీకాంత్ ,అంకం సందీప్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment