Thursday, 29 March 2018

ఏరియా తరలుతున్నదున ఏజీఎంకు ఘన సన్మానం


కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  మార్చి 29 ;  సింగరేణి భవన్ డిపార్ట్మెంట్లో ఏజీఎంగా విధులు నిర్వహిస్తున్న ఈ నెల 31 వ తేదిన ఉద్యోగ విరమణ పొందుతున్న తిరుమలరావును గురువారం బెల్లంపల్లి ఏరియా జిఎం రవిశంకర్ తరపున డివైపిఎం సుదర్శన్ శాలువా కప్పి పూల మలతో ఘనంగా సన్మానించినట్లు డిజిఎం పర్సనల్ కిరణ్ తెలిపారు. ఏరియాకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా తిరుమలరావు అందించిన సేవలు ఎల్లప్పుడు నిలిచి ఉంటాయన్నారు. అనుభవజ్జులైన అధికారులు ఉద్యోగ విరమణతో సంస్థకు దూరం అవుతున్నరని అయితే విధి నిర్వహణలో అందించిన సేవలు మాత్రం చిరకాలం నిలిచి ఉంటాయన్నారు.

No comments:

Post a Comment